దుబాయ్, అబుదాబీలలో మూడు రోజులపాటు నియామకాల డ్రైవ్
- May 26, 2021
యూఏఈ: మూడు రోజుల పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నియామకాలు (ఖాళీ వున్న పోస్టులు) చేపట్టబడతాయి. శనివారం మే 29 నుంచి దుబాయ్ మరియు అబుదాబీల్లో ఈ డ్రైవ్ చేపడతారు. సేల్స్ రంగంలో అనుభవం వున్న యూఏఈ రెసిడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ అనుభవం, రిటెయిల్ బ్యాంకింగ్ ఉత్పత్తులపై అవగాహన, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు వంటి వాటిపై అవగాహన, సెల్లింగ్ స్కిల్స్.. వున్నవారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత వుంటుంది. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం అలాగే ఇన్సెంటివ్స్ వుంటాయి వార్షిక పనితీరుని బట్టి వేతన పెంపు కూడా వుంటుంది. మెడికల్ ఇన్స్యూరెన్స్, వీసా సౌకర్యం కూడా కల్పిస్తారు. దుబాయ్, అబుదాబీలలోని యూఏఈ బ్యాంకుల కోసం పనిచేయాల్సి వుంటుంది. మే 29 నుంచి మే 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుబాయ్ మరియు అబుదాబీలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. దుబాయ్: సిటీ బే బిజినెస్ సెంటర్, మొదటి ఫ్లోర్, అబు హెయిల్ అలాగే, అబుదాబీ: ఆఫీస్ నెంబర్ 702, జిటిహెచ్ బిల్డింగ్, టూరిస్ట్ క్లబ్ ప్రాంతం, ఎలెక్ట్రా స్ట్రీట్.. వద్ద ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







