ముంబై నుంచి దుబాయ్: ఎమిరేట్స్ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు
- May 26, 2021
యూఏఈ: ముంబై నుంచి దుబాయ్.. విమానాన్ని ఎమిరేట్స్ సంస్థ ఇటీవల నడపగా, ఆ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు వుండడం గమనార్హం. భారతదేశం నుంచి ప్రయాణీకుల్ని యూఏఈ తాత్కాలికంగా నిషేధించిన దరిమిలా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఎంపిక చేసిన గ్రూపులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. అలా వెసులుబాటు పొందినవాటిల్లో డిప్లమాటిక్ మిషన్స్, గోల్డెన్ వీసా కలిగినవారు, యూఏఈ జాతీయులు, యూఏఈ అథారిటీస్ అదనంగా వెసులుబాటు కల్పించిన వ్యక్తులు మాత్రమే ప్రస్తుతం ఇండియా నుంచి యూఏఈ వెళ్ళడానికి వీలుంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న స్టార్ జెమ్స్ గ్రూప్ సీఈఓ భవేష్ జవెరీ (గోల్డెన్ వీసా కలిగిన వ్యక్తి) మాత్రమే ఈ విమానంలో ఒంటరిగా ముంబై నుంచి దుబాయ్ ప్రయాణించారు. 909 దిర్హాములు వన్ వే టికెట్ ధరగా చెల్లించారాయన.
#Emirates #Dubai #UAE @emirates #MaaGulf pic.twitter.com/Jo3VZFru3h
— Maa Gulf (@maagulf) May 26, 2021
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







