గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రత
- March 05, 2016
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ మరింత భద్రతను పెంచింది. పాక్ భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కచ్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. అజిత్ దోవల్ సూచన మేరక రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓ అధికారి చెప్పారు.గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా శనివారం పోలీసు, రక్షణ, ఐబీ, పారామిలటరీ బలగాల అధికారులతో సమావేశమయ్యారు. ఇదిలావుండగా రాష్ట్రంలోకి పది మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు ఎన్ఎస్ జీ బృందాలు గుజరాత్ కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







