కరోనావైరస్ పుట్టుక వెనుక గుట్టు కనిపెట్టండి.. యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు బైడెన్ ఆదేశాలు
- May 27, 2021
కోవిడ్-19 మూలాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వైరస్ పుట్టుక మొదట ఎక్కడన్నది శోధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించారు.
''మీ ప్రయత్నాలను వేగవంతం చేయండి. 90 రోజుల్లో నాకు నివేదిక ఇవ్వండి'' అని యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బైడెన్ కోరారు.
2019 చివర్లో చైనా నగరం వుహాన్‌లో మొట్టమొదట ఈ ప్రాణాంతక కరోనావైరస్ రకాన్ని గుర్తించారు. ఆ తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విలయం సృష్టిస్తోంది. వుహాన్‌లోని ఒక చేపల మార్కెట్లో తొలుత ఈ వైరస్ కేసులు బయటపడ్డాయని అధికారులు చెబుతుండగా.. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే, చైనాలోని ప్రయోగశాలలో ఈ వైరస్ తయారైందనడానికి ఆధారాలున్నాయంటూ ఇటీవల అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ బహుశా అమెరికా ల్యాబ్‌లలోనే తయారై ఉంటుందంటూ ప్రత్యారోపణలు చేసింది.
తాజా వార్తలు
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!







