NMDC లో ఉద్యోగావకాశాలు
- May 27, 2021
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనల్ లిమిటెడ్ (NMDC) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ స్థానాలను భర్తీచేయనున్నారు.
మొత్తం ఖాళీలు, అర్హతలు..
- ఇందులో భాగంగా మొత్తం 59 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–13,ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(పాసా)–30.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్స్, మైనింగ్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంపికై వారికి నెలకు రూ.20,000 వేతనంగా చెల్లిస్తారు.
- టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్–టెలీకమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
- అభ్యర్థులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
- ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(పాసా) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు.. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్(ఎన్సీవీటీ) జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. వీరికి జీతంగా నెలకు రూ.10,000 అందిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
- ఈ పోస్టుల ఎంపికను ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు.
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తమ వివరాలను [email protected] మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.
- దరఖాస్తులకు చివరి తేదీగా 15.06.2021 నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







