కొత్త సిలబస్ లో సెల్ఫ్ డిఫెన్స్, నేషనల్ యూనిటీ చేర్చిన సౌదీ
- May 28, 2021
సౌదీ: విజన్ 2030 కార్యచరణ, దేశ భవిష్యత్తు కోసం సూదీర్ఘ లక్ష్యాలతో సౌదీ ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో జాతీయ ఐక్యత, కుటుంబ జీవితం, సెల్ఫ్ డిఫెన్స్, డిజిటల్ స్కీల్స్, ఇస్లామిక్ స్టడీస్, స్మార్ట్ లర్నింగ్ తో ఓ సమీకృత, స్వతంత్ర విద్యావిధానాన్ని జోడించనుంది. విద్యార్ధులను స్కూల్ దశ నుంచే శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణలను అమలు చేస్తోంది. దేశం పట్ల భక్తిభావం, కుటుంబం పట్ల బాధ్యత, సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యత వంటి నైతిక అంశాలతో పాటు సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ బోధనాంశాలను ప్రాథమిక దశ నుంచే ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే..విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా బోధనాసిబ్బందిలోనూ అవగాహన పెంచేందుకు టీచర్లకు ఈ వేసవిలోనే శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







