ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు

- May 28, 2021 , by Maagulf
ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు

మస్కట్: ఒమనైజేషన్ లో భాగంగా ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులను సవరణలు చేసింది. ఈ మార్పులు జూన్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వర్క్ పర్మిట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా ఫీజు చెల్లించని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ప్రైవేట్ రంగంలోని ఎగువ, మధ్య శ్రేణి వర్క్ ఫోర్స్ తో పాటు సాంకేతిక రంగం, ఇతర నిపుణత కలిగిన రంగాల్లోని ప్రవాసీ ఉద్యోగుల వర్క్ పర్మిట్ల ఫీజులు మారనున్నాయి. ఈ మార్పుల కారణంగా వర్క్ పర్మిట్ల సంఖ్య తగ్గి స్థానికులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com