భారతీయులకు శుభవార్త
- March 06, 2016
జపాన్‌లో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకుల కోసం జపాన్ తన వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆర్డినరీ పాస్‌పోర్టుపై తాత్కాలికంగా జపాన్‌లో ఉండేందుకు తరచూ వచ్చే భారతీయులకు వీసా నిబంధనలు సడలించింది. ఇప్పటికే భారత్ జపనీయులకు 'వీసా ఆన్ అరైవల్' ఇస్తామంటూ స్నేహహస్తం చాచిన నేపథ్యంలో జపాన్ కూడా ఈ మేరకు ముందుకొచ్చింది.ఆర్డినరీ వీసాలపై జపాన్‌కు వచ్చే భారతీయుల గరిష్ఠ వీసా గడువును కూడా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పెంచింది. మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై పర్యాటక, వ్యాపార అవసరాల కోసం వచ్చేవారి గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది.
గత ఏడాది డిసెంబర్‌లో జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబే భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా కుదుర్చుకున్న అవగాహనలో భాగంగా ఇరుదేశాలు ఈ మేరకు వీసా షరత్తులో సడలింపు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్‌లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







