'డిడిఎఫ్' టెన్నిస్ లాటరీ డ్రా లో ఆడి కారును గెల్చుకొన్నభారతీయుడు
- March 06, 2016
' సుడి ఉంది కాబట్టే సుదూర దూరంలో ఉన్న ఆడి కారు అతని స్వంతంయ్యంది '... దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ పురుషుల తుది పోరు తర్వాత నిర్వహించిన ఒక లాటరీ డ్రా లో భారతీయునికి ఒక విదేశీ కారు బహుమతిగా దక్కింది. కెరళాకు చెందిన షాజీ జాన్ కు ఈ గెలుపుతో తన చిర కాల స్వప్నం నెరవేరింది. అతను కొన్న టికెట్ వరుసక్రమం 0050 లో టికెట్ సంఖ్య.1622 కు అదృష్టం వరించింది. ఒక ఆడి క్యూ7 3. 0T ధగ ధగ లాడే తెల్లని కొత్త కారును పొందే అదృష్ట విజేతగా నిలిచాడు. ఈ బహుమతి గెల్చుకొన్న షాజీ జాన్ టికెట్ ను ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్ లో 4 వ క్రీడాకారుడు, మొదటి దుబాయ్ టైటిల్ విజేత స్టాన్ వావ్రింకా డ్రా ను తీయగా అదృష్టం షాజీ జాన్ ను వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , " నేను ప్రస్తుతం చంద్రునిపై విహరిస్తున్నాను.... నేనేనా...ఈ ఈ అద్భుతమైన కారు గెలిచింది అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఈ కారును నడుపుకొంటూ నా జన్మ స్థలమైన కేరళాకు వెళ్ళి అక్కడ కొంతమందిని కళ్ళు తిరిగి కింద పడేలా చేయాలని ఉందన్నాడు, ఈ బహుమతిని తనకు ఇచ్చిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ ధన్యవాదాలు అని తెలిపాడు. "
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







