ప్రవాసీయుల రిక్రూట్మెంట్ పర్మిట్ తగ్గించిన ఒమన్

- May 29, 2021 , by Maagulf
ప్రవాసీయుల రిక్రూట్మెంట్ పర్మిట్ తగ్గించిన ఒమన్

 ఒమన్: ఒమనైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవాసీయుల రిక్రూట్మెంట్ అనుమతులను తగ్గించింది. దేశంలో అన్ని రంగాల్లో మధ్యస్థ, ఎగువ తరగతి ఉద్యోగాలు, వృత్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఆర్ధిక తోడ్పాటు ప్రణాళిక మేరకు వివిధ సంస్థల్లో ప్రవాసీయుల కార్మిక శక్తి, ఒమనీయుల కార్మికశక్తిని బేరీజు వేసుకొని ఆయా సంస్థల రిక్రూట్మెంట్ పర్మిట్ ఫీజుల్లో మినహాయింపు ఉంటుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. మంత్రివర్గ తీర్మానం 21/2021 మేరకు ప్రవాసీయుల భర్తీ శాతం మేరకు లైసెన్స్ జారీ, లైసెన్స్ రెన్యూవల్ ఫీజులో సవరణలు చేసే వెసులుబాటు ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఒమనీ కార్మిక శక్తికి తగిన ప్రాధాన్యత ఇచ్చిన సంస్థలకు 25 శాతం, ఒమనైజేషన్ రేటు మేరకు కార్మికశక్తిని భర్తీ చేసుకున్న సంస్థలకు 50 శాతం ఫీజు తగ్గింపు ఉంటుంది. ఒమనైజేషన్ శాతాన్ని బట్టి ఫీజులో తగ్గింపు సవరణలు ఉంటాయని కార్మికశాఖ వెల్లడించింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com