అల్ బవారిహ్: దుమ్ము, దూళి ఎగసిపడే అవకాశం

- May 29, 2021 , by Maagulf
అల్ బవారిహ్: దుమ్ము, దూళి ఎగసిపడే అవకాశం

దోహా: అల్ బవారిహ్ అని పిలవబడే బలమైన గాలి, తిరిగి రానుంది. మే 31 నుంచి వారాంతం వరకు ఈ భారీ గాలులు వీయడం, దుమ్ము ధూళి ఎగసిపడటం జరుగుతాయని ఖతార్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ గాలుల వేగం 12-22 కెటి నుంచి 30 కెటి వరకూ వుండొచ్చు.ఈ గాలుల తీవ్రత కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోతుంది. పగటి వేళల్లో వేడి ఎక్కువగా వుండొచ్చు. 37 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు 24 నుంచి 33 వరకు నమోదవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com