డల్స్కో, కాన్సులేట్ స్పెషల్ ఈవెంట్..ఆయుర్వేద, యోగాపై అవగాహనా కార్యక్రమం

- May 29, 2021 , by Maagulf
డల్స్కో, కాన్సులేట్ స్పెషల్ ఈవెంట్..ఆయుర్వేద, యోగాపై అవగాహనా కార్యక్రమం

దుబాయ్: దుబాయ్ కాన్సులేట్, డల్స్కో దుబాయ్ సహకారంతో యోగా మరియు ఆయుర్వేదపై అవగాహన మరియు వర్క్ షాప్ నిర్వహించింది.మే 28న ఈ కార్యక్రమం డల్స్కో ఈవెంట్స్ ఎరీనా, అల్ కూజ్లో జరిగింది. కాన్సులర్ అలాగే వెల్ఫేర్ సంబంధిత అంశాలపై PBSK(ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర), దుబాయ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. ఆరోగ్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగా.. అనే కోణంలో వర్క్ షాప్ నిర్వహించారు. దత్త యోగా సెంటర్ యోగా గురు కె.ఎస్.ఎన్.కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇమ్యూనిటీ పెంచేందుకు ఆయుర్వేదంలో వున్న మార్గాల గురించి, సాధారణ ఆరోగ్య సమస్యల గురించీ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమిరేట్స్ ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, దుబాయ్ చాప్టర్ మరియు సైన్స్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆయుర్వేద డాక్టర్లతో ఉచిత కన్సల్టేషన్ నిర్వహించారు. ర్యాఫిల్ డ్రా, షార్ట్ క్విజ్ పోటీలు కూడా నిర్వహించారు. డల్స్కో హెచ్.ఆర్. డైరెక్టర్ ప్రభు ధర్మరాజన్ మరియు లేబర్ కాన్సుల్ సిజిఐ దుబాయ్ తాడు మాము, పి.బి.ఎస్.కె. ఇన్ఛార్జి అనీష్ చౌదరి తదితరులు ప్రసంగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com