'TANA' అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు
- May 30, 2021
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించింది. దీంతో తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికయ్యారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యం కనబరిచిన నిరంజన్ ప్యానెల్ చివరికి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ విజయంతో నిరంజన్ ప్యానెల్ సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు.ఇక శృంగవరపు నిరంజన్‌కు తానా ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.వీరి ద్వారా నిరంజన్ ప్యానెల్‌కు సుమారు 1,758 ఓట్లు వచ్చినట్లు సమాచారం.కాగా, నరేన్ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమన ఉన్నారు.తానా అధ్యక్షుడిగా ఎన్నికైన నిరంజన్ శృంగవరపు పలువురు ఎన్ఆర్ఐలు అభినందించారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







