ప్రియురాలితో బ్రిటన్ ప్రధాని రహస్య వివాహం!
- May 30, 2021
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్‌తో శనివారం బోరిస్ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్, మెయిల్ ఆన్ సండేవర్క్ లాంటి టాబ్లాయిడ్లు ప్రముఖంగా ప్రచురించాయి.

బోరిస్-సైమండ్స్ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షలు కొనసాగుతుండడంతో 30 మందికి మాత్రమే వివాహ వేడుకలకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1గం.30ని సమయంలో వివాహం జరిగిందని, సైమండ్స్ అరగంట ఆలస్యంగా వచ్చిందని ఆ కథనాలు వెల్లడించాయి. కాగా, బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్ స్ట్రీట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు.
అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి. గతంలో బోరిస్(56) వివాహేతర సంబంధంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్ జాన్సన్‌కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్ అనే లాయర్‌కి 2018లో విడాకులిచ్చారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







