ఇక నుంచి పూర్తిగా ఆన్ లైన్లోనే ఆర్టీఏ సర్వీసులు

- May 30, 2021 , by Maagulf
ఇక నుంచి పూర్తిగా ఆన్ లైన్లోనే ఆర్టీఏ సర్వీసులు

దుబాయ్: డిజిటలైజేషన్ లో భాగంగా ఆర్టీఏ సర్వీసులు అన్నింటిని ఆన్ లైన్ కి మారుస్తున్నట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. జూన్ 13 నుంచి వాహనాల లైసెన్సింగ్, ఫైన్ చెల్లింపులను ఆన్ లైన్ లోనే నిర్వహించుకోవచ్చు. ఆన్ లైన్ లో అందుబాటులో సర్వీసులు ఇకపై ఆర్టీఏ సర్వీస్ సెంటర్ల సేవల పరిధి నుంచి పూర్తిగా తొలిగించినట్లు కూడా ఆర్టీఏ స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా ఐదు రకాల వాహనాల లైసెన్సింగ్ సర్వీసింగ్..ఇన్సూరెన్స్ రీఫండ్, వెహికిల్ ఓనర్ షిప్, నాన్ ఓనర్ షిప్ ఆఫ్ వెహికిల్, వెహికిల్ క్లియరెన్స్, రిజిస్టర్ వాహనాల సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించిన సేవలన్ని ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. జరిమానాల చెల్లింపులు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ఆర్టీఏ సేవలను http://www.rta.ae వెబ్ సైట్ ద్వారాగానీ, దుబాయ్ డ్రైవ్ యాప్, కాల్ సెంటర్ 8009090 ద్వారా పొందవచ్చు. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రావటంతో ఇక నుంచి లెర్నింగ్ డ్రైవర్ ఫైల్ క్లియరెన్స్ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గనుంది. గతంలో లెర్నింగ్ డ్రైవర్ ఫైల్ కోసం రెండు రోజుల సమయం, నాలుగు సార్లు ఆర్టీఏ ఆఫీస్ విజిట్ చేయాల్సి వచ్చేది. ఇక నుంచి అసలు ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com