కోవిడ్ రూల్స్ బ్రేక్..ఓ రెస్టారెంట్ సీజ్

- May 30, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్..ఓ రెస్టారెంట్ సీజ్

బహ్రెయిన్: కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఓ రెస్టారెంట్ ను మూసివేసినట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. దేశంలో  సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు నిబంధనలు సడలించిన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్...కొన్ని షరతులతో ఇండోర్ డైనింగ్ సర్వీస్ కు అనుమతించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేసి లోనికి అనుమతించాలని, టేబుల్..టేబుల్ కి మధ్య ఎడం పాటించాలి వంటి నిబంధనలతో డైనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు హెల్త్ మినిస్ట్రి...అంతర్గత మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. మొత్తం 195 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా..27 చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. అయితే..ఓ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణ కావటంతో ఆ రెస్టారెంట్ ను అధికారులు మూసివేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com