కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు
- March 06, 2016
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు.ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు.సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







