బుర్రిపాలెంలో వ్యాక్సిన్ పంపిణీ..!

- May 31, 2021 , by Maagulf
బుర్రిపాలెంలో వ్యాక్సిన్ పంపిణీ..!

అమరావతి: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సొంత గ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.నేడు కృష్ణ పుట్టిన సందర్భంగా.. బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్‌ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహించాడు.ఈ విషయాన్నీ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఈ డ్రైవ్‌ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపాడు. "బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్‌ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్‌ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని మహేష్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com