వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్
- June 01, 2021
దుబాయ్: దుబాయ్ ఎమిరేట్స్ ప్రజలు ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆటోమెటిగ్గా స్లాట్ బుకింగ్ చేసేలా వాట్సాప్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ-DHA స్పష్టం చేసింది. ఈ సౌకర్యం పొందేందుకు 800 342 నెంబర్ ను ఫోన్ కాంటాక్ట్ లిస్టులో యాడ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయాలి. వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కోసం మెడికల్ రికార్డ్ నెంబర్ ను ఖచ్చితంగా పేర్కొవాలి. ఆ తర్వాత లబ్ధిదారులు తమకు అనువైన విధంగా వ్యాక్సినేషన్ సెంటర్, తేదీ, సమయం వివరాలు సెలక్ట్ చేయాలి. ఈ వివరాలన్నింటిని ఎంటర్ చేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారులకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ తో పాటు తేది, సమయాన్ని నిర్ధారిస్తూ వ్యాక్సిన్ స్లాట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







