ప్రభుత్వ బీమా ఉన్నా.. లేకున్నా రూ.10 లక్షల పరిహారం
- June 02, 2021
అమరావతి: కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియ జేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చని పోయిన పిల్లలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు.నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది.ఈమేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కు.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







