మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్...
- June 02, 2021
ముంబై: మహారాష్ట్రలోని గ్రామాల్లో కరోనా కట్టడి లక్ష్యంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త ప్రోగ్రాం ప్రకటించారు. కరోనా రహిత గ్రామంగా నిలిచే గ్రామాలకి రూ. 50 లక్షలు బహుమతి ఇస్తామన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ లో ఈ తరహ గ్రామాల్లో 22 అంశాల ఆధారంగా పరిశీలన జరిపి బహుమతులు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు గ్రామాలను ఎంపిక చేసే తొలి, రెండో, మూడవ బహుమతులను ఇస్తామన్నారు. మొదటి బహుమతికి 50 లక్షలు కాగా, రెండో బహుమతికి రూ .25 లక్షలు, మూడో బహుమతికి రూ .15 లక్షలు లభిస్తాయి. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో మంగళవారం నాటికీ గడిచిన 24 గంటల్లో 14,123 కోవిడ్ కేసులు, 477 మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 57,61,015 కి చేరింది. మరణాల సంఖ్య 96,198 కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







