విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్
- June 03, 2021
హైదరాబాద్: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుకానున్నది. ఇందుకోసం శుక్రవారం నుంచి తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డిపార్టుమెంటు వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ అవకాశం అందుబాటులోకి రానున్నది.విదేశాలకు విద్యా అవసరాల కోసం వెళ్ళే విద్యార్థులకు వ్యాక్సిన్ లు లేని కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖ భావించింది.
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వీరికి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యతలు తీసుకున్నది. ఎన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఉంటుంది, వారి కోసం ఏ సమయాన్ని కేటాయించాలి, మొత్తం ఎంత మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నది. ఒక రోజు ముందుగానే సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపిక చేసుకునేలా వెబ్సైట్లో ఆప్షన్లను పెట్టనున్నది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







