విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్

- June 03, 2021 , by Maagulf
విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుకానున్నది. ఇందుకోసం శుక్రవారం నుంచి తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డిపార్టుమెంటు వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ అవకాశం అందుబాటులోకి రానున్నది.విదేశాలకు విద్యా అవసరాల కోసం వెళ్ళే విద్యార్థులకు వ్యాక్సిన్ లు లేని కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖ భావించింది.

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వీరికి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యతలు తీసుకున్నది. ఎన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఉంటుంది, వారి కోసం ఏ సమయాన్ని కేటాయించాలి, మొత్తం ఎంత మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నది. ఒక రోజు ముందుగానే సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపిక చేసుకునేలా వెబ్‌సైట్‌లో ఆప్షన్లను పెట్టనున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com