కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు అండగా రిలయన్స్ ఫ్యామిలీ...
- June 03, 2021
ముంబై: కరోనా మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకం సహాయం చేస్తుంది. COVID-19 యొక్క 2 వ వేవ్ భారతదేశంపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.ఈ సంవత్సరం వేలాది మంది తీవ్ర సంక్రమణకు గురైనందున, దేశవ్యాప్తంగా ఉన్నచాలా కుటుంబాలు ప్రియమైనవారిని, సహచరులను, స్నేహితులను కోల్పోయారు. ఈ బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి దేశ ప్రజలు కష్టపడుతున్నారు. ఇటువంటి పరీక్షా సమయాల్లో, ఒకరికొకరు నిలబడటం అత్యవసరం అని రిలయన్స్ గ్రూప్ భావించింది. మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాని ఇస్తూ, రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకాన్ని ప్రకటించింది .
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఈ పథకం గురించి మాట్లాడుతూ "ఒక రిలయన్స్ ఫ్యామిలీ" మెంబర్ గా మీ కుటుంబంలోని ఓ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన భర్తీని మేము పూడ్చలేనప్పటికీ, ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము కట్టుబడి ఉన్నాము. రిలయన్స్ ఉద్యోగుల సంరక్షణకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది అని అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







