హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
- June 03, 2021
హైదరాబాద్: జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL)కు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గోల్డ్ రికగ్నిషన్ 2021 లభించింది. GHIAL విమానాశ్రయ కార్యకలాపాలలో సమర్థవంతమైన ఎయిర్ క్వాలిటీ (వాయు నాణ్యత) నిర్వహణను గుర్తించిన అంతర్జాతీయ ప్యానెల్ ఈ అవార్డును నిర్ణయించింది. GHIAL ఈ అవార్డును అందుకోవడం వరుసగా ఇది నాలుగవసారి.
ACI యొక్క గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి చేపట్టే ఉత్తమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టే ACI ఆసియా-పసిఫిక్ సభ్యులను గుర్తిస్తుంది.
_1622713406.jpg)
విమానాశ్రయ పరిసరాలలో ఎయిర్ క్వాలిటీ (వాయు నాణ్యత)ను మెరుగుపరచడానికి GHIAL చేపట్టిన, ACI ప్రశంసలు పొందిన కొన్ని కార్యక్రమాలు:
ఫిక్స్‌డ్ ఎలక్ట్రికల్ గ్రౌండ్ పవర్ (FEGP) ఉపయోగించడం ద్వారా ఆగ్జిలరీ పవర్ యూనిట్ వాడకాన్ని నివారించి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఆదా చేయడం.
సౌరశక్తితో పనిచేసే బ్యాగేజ్ ఫ్రెయిట్ లోడర్ (BFL), స్టెప్ ల్యాడర్, ఎలక్ట్రిక్ కోచ్‌లు, టగ్‌లు మరియు వాహనాల వల్ల డీజిల్ మరియు అనుబంధ వాయు ఉద్గారాల ఆదా.
విమానాశ్రయం నుంచి నగరం వైపు వెళ్లే ఎలెక్ట్రిక్ బస్సులు, కార్ల కారణంగా వేల లీటర్ల డీజిల్ ఆదా విమానం సింగిల్ ఇంజిన్ ట్యాక్సీయింగ్ కారణంగా ATF ఆదా
GHIAL యొక్క CEO శ్రీ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుస్థిర విమానాశ్రయ కార్యకలాపాలను మా వ్యాపారంలో అంతర్భాగంగా భావిస్తాము. పర్యావరణ అనుకూలమైన రీతిలో కార్యకలాపాలను నిర్వహించడానికి మేం కట్టుబడి ఉన్నాము. ఈ పర్యావరణ విధానంలో భాగంగా, అనేక పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాము. మా భాగస్వాములందరి సహకారంతో మేం కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వీలైనంత తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ గుర్తింపును మేము వినయంగా స్వీకరిస్తున్నాము. ఇది మేం మరిన్ని పర్యావరణ అనుకూల కార్యక్రమాలను తీసుకోవటానికి ప్రోత్సహిస్తుంది.” అన్నారు.
విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుండి, సుస్థిరత అనేది GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలలో ప్రధానాంశంగా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన ఉద్యోగులు, భాగస్వాములు చురుకుగా పర్యావరణపరంగా స్థిరమైన పద్ధతులను అవలంబించేలా వారిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, ఎర్త్ డే మొదలైనవి పాటించడం ద్వారా విమానాశ్రయ కమ్యూనిటీని, ప్రయాణికులలో పర్యావరణ అవగాహనను పెంచుతుంది. విమానాశ్రయ సుస్థిర కార్యకలాపాల ఫలితంగా శిలాజ ఇంధన వినియోగం, ఫలితంగా విమానాశ్రయ వాయు ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి.
ACI ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ పర్యావరణ కమిటీ సహకారంతో గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ గుర్తింపు కార్యక్రమం 2017లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాదీ వివిధ పర్యావరణ అంశాలను హైలైట్ చేస్తారు. 2018 నుండి, GHIAL వివిధ స్థిరమైన కార్యక్రమాల ద్వారా ACI గ్రీన్ విమానాశ్రయ గుర్తింపు అవార్డులను గెలుచుకుంటోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







