ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభం

- June 05, 2021 , by Maagulf
ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు  స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానం అవలంబించడంలో అగ్ర స్థానంలో ఉన్నారనీ రాష్ట్ర హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ని ఆసిఫ్ నగర్  పోలీసు స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లడుతూ....  తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ప్రజలతో సత్సంబంధాలు  ఏర్పరచుకొని తెలంగాణ పోలీసులు విధులను నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారాన్నారు .తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పోలీసు శాఖకు ప్రాముఖ్యత ఇచ్చారని  అనేక సంస్కరణలను తీసుకువచ్చారని తెలిపారు.ముఖ్యమంత్రి పోలీసు శాఖకు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను వాహనాల కొనుగోలు  కోసం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న  రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.... గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన పనితీరుతో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా తెలంగాణ పోలీసులు సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారని అభినందించారు. దేశంలో సిసిటివి ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని దేశంలోని 70% కెమెరాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయని తెలిపారు.ఇవే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సిసిటివి కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్‌కు ముఖ్యమైన స్థానం ఉందన్నారు. డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు  ప్రాధాన్యత ఇచ్చామని వారి  సమస్యలను  పరిష్కరించడానికి మరియు భద్రతను అందించడానికి" షీ టీమ్ లను " ను ఏర్పాటు చేశామని దీంతో చక్కటి ఫలితాలు  వస్తున్నాయన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మరియు అతని  బృందాన్ని డిజిపి అభినందించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్వాగతోపన్యాసం చేయగా ఎం.ఎల్.సి ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్, అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్)  శిఖా గోయల్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్, అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డిఎస్ చౌహాన్, జాయింట్ పోలీస్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు డాక్టర్ ఖాసిమ్, కరుణకర్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com