జెరూసలేంలో మహిళా జర్నలిస్ట్ అరెస్ట్
- June 06, 2021
జెరూసలేం: అల్ జజీరా టీవీ ఛానల్‌కు చెందిన మహిళా కరస్పాండెంట్ గివారా బుడెరినిను ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.జెరూసలేం సమీపంలోని యూదుల స్థావరాల నుంచి డజన్ల కొద్దీ పాలస్తీనా కుటుంబాలను తొలగించే అంశంపై ఆమె రిపోర్టింగ్ చేస్తుండగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.అయితే, అరెస్టు చేసిన చాలా సేపటి తర్వాత ఆమెను ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసులు విడుదల చేశారు.
సరిహద్దులోని పాలస్తీనా స్థావరంలో కవరేజి కోసం వచ్చిన గివారా బుడెరిని గుర్తింపు కార్డు చూపాలని తొలుత ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసులు అడిగారు.కారులో ఉన్న గుర్తింపు కార్డు కోసం డ్రైవర్‌కు ఫోన్ చేయాలని ఆమె సూచించగా,ఇజ్రాయెల్ పోలీసులు నిరాకరించారు.అనంతరం అమెను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు.పోలీసులు తమ కెమెరామెన్ చేతిలోని కెమెరా,ఇతర పరికరాలను పగలగొట్టారని అల్ జజీరా ఛానల్ పేర్కొన్నది.జర్నలిస్ట్ గివారా బుడెరి చేయి విరిగిపోయిందని,జెరూసలేంలోని హడస్సా దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు అల్ జజీరాకు జెరూసలేం బ్యూరో చీఫ్ వాలిద్ ఉమేరి తెలిపారు.షేక్ జరాహ్ నుంచి ఈ మహిళా జర్నలిస్ట్ క్రమం తప్పకుండా రిపోర్ట్ చేసేదని ఉమేరి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









