బహ్రెయిన్: కొత్త కోవిడ్ మెడికల్ సెంటర్ ప్రారంభం
- June 07, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ వద్ద స్పెషలైజ్డ్ కోవిడ్ 19 మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) హెడ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ హబ్‌ని ప్రారంభించారు. స్వల్ప, మధ్యస్త తీవ్రత వున్న కరోనా కేసులకు వైద్య చికిత్స అందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ కేంద్రంలో 8 స్టేషన్లు వున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం 8 స్టేషన్లు, నర్సింగ్ కోసం ఆరు స్టేషన్లు, 16 మెడికల్ క్లినిక్స్, చికిత్స కోసం ఏడు గదులు, ఏడు ఫాలో అప్ గదులు మరియు స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. రేడియాలజీ పరికరాలు కూడా ఇక్కడ వున్నాయి. 80కి పైగా బెడ్స్ ఏర్పాటు చేశారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చారు. రెండు అంబులెన్సులు కూడా అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







