దేశంలో 80% మందికి కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి
- June 08, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్న దేశాల్లో ఒక్కటైన బహ్రెయిన్...సోమవారం నాటి వ్యాక్సినేషన్ తో మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. అంటే ఇప్పటివరకు కనీసం ఫస్ట్ డోస్ తీసుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటిందని బహ్రెయిన్ ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలోని పౌరులు, ప్రవాసీయుల జనాభాలో ఇది 80 శాతమని పేర్కొంది. ప్రస్తుతానికి బహ్రెయిన్ ఆరు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది. సినోఫార్మ్, ఫైజర్ బయోన్టెక్, అస్ట్రాజెన్కా-కోవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ ఈ ఆరు రకాల వ్యాక్సిన్లకు అత్యవసర ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10,02,977 మందికి కనీసం ఫస్ట్ డోస్ ఇచ్చినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ వివరించింది. అందులో 8,23,489 మందికి రెండు డోసులు పూర్తైనట్లు వెల్లడించింది. అయితే..దేశంలో పౌరులు, ప్రవాసీయులు కలిపి 15 లక్షల వరకు ఉన్నారు. అందులో 712,000 మంది బహ్రెయినీలు ఉంటే.. 6,79,000 మంది ప్రవాసీయులు ఉన్నారు. వీళ్లందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించటం ద్వారా బహ్రెయిన్‌ను కోవిడ్ నుంచి రక్షించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









