పవిత్ర మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం స్మార్ట్ రోబోలు

- June 08, 2021 , by Maagulf
పవిత్ర మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం స్మార్ట్ రోబోలు

మక్కా: మక్కా, మదీనాలోని పవిత్ర మసీదుల్లో వైరస్ నిర్మూలనకు స్మార్ట్ రోబోలను వినియోగించనున్నారు. రెండు మసీదుల జనరల్ ప్రెసిడెన్సీ అఫైర్స్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం పది స్మార్ట్ రోబోలను అందించింది. ఈ స్టార్ట్ రోబోలు మనిషి సాయం లేకుండానే 5 నుంచి 8 గంటల పాటు సొంతంగా స్టెరిలైజేషన్ ప్రక్రియను నిర్వహించగలవు. ఇందులో ఆరు అంచెలుగా ముందుగానే  లోడ్ చేయబడిన మ్యాప్ ఉంటుంది. దాని ఆధారంగా ఏయే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలి, ఎంతమేర చేయాలి అని దానికదే విశ్లేషించుకోగలుగుతుంది. మొత్తం 23.8 లీటర్ల స్టెరిలైజర్స్ కెపాసిటీతో వర్క్ చేసే ఈ స్మార్ట్ రోబోలు గంటకు రెండు లీటర్ల చొప్పున 600 స్క్వైర్ మీటర్ల వరకు స్ప్రే చేయగలుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com