జూన్ 9న కువైట్ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి

- June 08, 2021 , by Maagulf
జూన్ 9న కువైట్ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి

కువైట్ సిటీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రేపు (జూన్ 9) కువైట్లో పర్యటించనున్నారు. కువైట్-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపరిచేలా ఆయన ప్రధాని మోదీ సందేశాన్ని కువైట్ కు అందజేస్తారు. అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా కువైట్ కొత్త రూలర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి తొలి అధికారిక పర్యటన ఇదే కావటం విశేషం.  షేక్ సబా అల్-అహ్మద్ అల్-సబా మరణం తరువాత, హెచ్ హెచ్ షేక్ నవాఫ్ గత సెప్టెంబర్ లో కొత్త పాలకుడిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..గతేడాది మార్చిలో కువైట్ విదేశాంగ మంత్రి అహ్మద్ నాజర్ అల్ మహ్మద్ అల్-సబా భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాత భారత్ వైపు నుంచి తొలి అధికారిక పర్యటన ఇది. పలు క్లిష్ట పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో రాజకీయంగా, సాంకేతికంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మైత్రి బంధాన్ని బలపర్చుకున్న ఇరు దేశాలు, భవిష్యత్తులో తమ మైత్రిని మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో జైశంకర్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని లేఖ ద్వారా పంపిన సందేశాన్ని కువైట్ రూలర్ కు అందజేస్తారని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com