మెట్రోలో ఆసియా వ్యక్తి ఓవరాక్షన్..అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు

- June 08, 2021 , by Maagulf
మెట్రోలో ఆసియా వ్యక్తి ఓవరాక్షన్..అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: జనంలో ఉన్నామన్న సోయి లేదు. మాస్క్ పెట్టుకోవాలని ఇంగితం లేదు. సమాజంలో బతుకుతున్నామన్నా విచక్షణ మరిచి అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ఆసియా వ్యక్తిని దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో నిందితుడు తోటి ప్రయాణికులతో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులు అతని వెకిలి చేష్టలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వీడియో వైరల్ గా మారింది. అది పోలీసుల దృష్టికి వెళ్లటంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. పబ్లిక్ ఇండీసెంట్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష, 5,000 దిర్హామ్ ల జరిమానా విధించవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే పబ్లిక్ ప్రాంతంలో మాస్క్ ధరించకుండా కోవిడ్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించినందుకు మరో కేసు నమోదు చేసి జరిమానా విధించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com