మెక్సికో రాయబారికి స్వాతంత్ర్య పురస్కారం

- March 06, 2016 , by Maagulf
మెక్సికో రాయబారికి  స్వాతంత్ర్య పురస్కారం

 యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మరియు మెక్సికో దేశాల మధ్య సహకారాన్ని అన్నిరంగాల్లో స్నేహపూర్వక సంబంధాలు మరియు  ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా యు ఎ.ఇ. లో  మెక్సికో రాయబారి ఫ్రాన్సిస్కో జేవియర్ అలోన్సో ఎస్కోబార్ కు   స్వాతంత్ర్య ఖలీఫా అవార్డులు  గౌరవ అధ్యక్షుడు  షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్  స్వాతంత్ర్య అవార్డును ప్రదానం చేశారు.  మెక్సికో రాయబారి ఈ సందర్భంగా  గౌరవ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు  తన కృతజ్ఞతలు మరియు ప్రశంసలను వ్యక్తం చేశారు. తన  రాజకీయ జ్ఞానంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో మెక్సికో రాయబారి ఫ్రాన్సిస్కో జేవియర్ అలోన్సో ఎస్కోబార్  ప్రముఖ పాత్రను  పోషించి  ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో కీలక పాత్రను వహించారని  ప్రశంసించారు. రాయబారి ఎస్కోబార్  మాట్లాడుతూ తనకు  అప్పగించిన భాద్యతను నిజాయితీగా పనిచేయడం ద్వారా ఈ గౌరవాన్ని దక్కించుకొన్నట్లు తెలిపారు. తన పదవీ కాలములో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రభుత్వ సహకారం అధికారుల మంచితనం  తన  విజయానికి దోహదపడిందన్నారు. ఇందుకు తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు, 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com