ఈసేవా ద్వార రేషన్ కార్డు...
- March 07, 2016
రేషన్‌కార్డు కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. నేరుగా మీ సమీపంలో ఉన్న ఈసేవా, మీసేవా కేంద్రాల్లోనే దరఖాస్తులు అందించవచ్చు. ఇందుకు రూ.35 రుసుముగా చెల్లించాలి.
దరఖాస్తు చేసిన వెంటనే కార్డు జారీ ప్రక్రియ మొదలవుతుందని యంత్రాంగం చెబుతోంది.
నిరంతర ప్రక్రియ: అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు జారీ చేయాలనే సంకల్పం ప్రభుత్వానిది. తెల్ల కాగితంపై లబ్ధిదారుల వివరాలను రాసి ఇస్తే దానినే దరఖాస్తుగా పరిగణించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కార్డు జారీ నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. ప్రస్తుతం గ్రేటర్‌లోని 12 సర్కిళ్ల పరిధిలో సుమారు 14 లక్షల పైచిలుకు కార్డులున్నాయి. ఇప్పటికీ కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో దరఖాస్తుల స్వీకరణ పౌర సరఫరాల శాఖకు తలనొప్పిగా మారింది. అందుకే ప్రభుత్వం తాజాగా ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. జారీ చేస్తారిలా: గ్రేటర్‌లోని అన్ని ఈసేవా, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే కార్డు మంజూరైనప్పటికీ చిరునామా, ఇతర వివరాల్లో మార్పు చేసుకునేందుకు అవకాశం ఉంది. కేంద్రాల దగ్గర ఉన్న దరఖాస్తులో పేర్కొన్న వివరాలతో పాటు ఆధార్ కార్డును నిర్వాహకులు స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తారు. వెంటనే అది సంబంధిత పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్‌కు చేరుతుంది. ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సక్రమమే అనుకుంటే ఏఎస్‌వోకు నివేదిస్తారు. ఏఎస్‌వో ఆమోదించాక ఆ దరఖాస్తు డీఎస్‌వోకు వెళ్తుంది. అక్కడ ఖరారుకాగానే కార్డు మంజూరవుతుంది. వివరాలను అంతర్జాలంలో అప్‌లోడ్ చేస్తారు. ఈపీడీఎస్ తెలంగాణ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ సంఖ్య సాయంతో ఏ దుకాణం కేటాయించారో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







