యూఏఈలో 84% మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

- June 09, 2021 , by Maagulf
యూఏఈలో 84% మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

యూఏఈ: యూఏఈలో అర్హులైన ప్రజల్లో (16 ఏళ్లు అంతకుపైబడిన వయసువారు) 84.66% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది యూఏఈ. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంపై వీక్లీ రీవ్యూ నిర్వహించిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉండే 60 ఏళ్ల వయసుకు మించిన వారిలో 95.27% మందికి వ్యాక్సిన్ అందినట్లు వివరించారు. రానున్నరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేస్తామన్నారు. కోవిడ్ ప్రభావాన్ని నామ మాత్రానికి తగ్గించి దేశ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలంటే వ్యాక్సినేషన్ అత్యవసరంగా తాము భావిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com