శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా శైవ క్షేత్రాలు..
- March 07, 2016
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివ దర్శనం కోసం దేవాలయాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివలయాలను దర్శించుకుంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేవాలయాలు హోరెత్తుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తులు గోదావరి నదిలో స్నానాలుచేసి కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







