భారీగా స్టాక్ సమకూరిన తర్వాతే సెకండ్ డోస్ వ్యాక్సిన్
- June 10, 2021
సౌదీ: ఫస్ట్ డోస్ తీసుకొని రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న వారిని ఉద్దేశించి సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఎక్కువ మొత్తంలో స్టాక్ సమకూరిన తర్వాతే కింగ్డమ్ వ్యాప్తంగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కింగ్డమ్ వ్యాప్తంగా 14 మిలియన్ల మందికి తొలి డోస్ వ్యాక్సిన్ అందింది. అయితే..ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి గత ఏప్రిల్ 10 నుంచే సెకండ్ డోస్ అందించాల్సి ఉంది. కానీ, వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి తగినంత ఉత్పత్తి లేకపోవటంతో సెకండ్ డోస్ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై రివ్యూ చేసుకున్న ఆరోగ్య శాఖ తొలుత వీలైనంత ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ అందించి ప్రజలను వైరస్ తీవ్రత నుంచి రక్షించాలని నిర్ణయించుకుంది. ఇక భారీ స్థాయిలో వ్యాక్సిన్ స్టాక్ సమకూరిన తర్వాత సెకండ్ డోస్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!







