'పోకిరి రాజా త్వరలో తెలుగులో..
- March 07, 2016
తమిళనటుడు జీవా, హన్సిక జంటగా నటించిన చిత్రం 'పోకిరి రాజా'. తాజాగా తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నటుడు జీవా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుగు ప్రేక్షకులకు వెల్లడించారు. అంతేకాకుండా చిత్ర తెలుగు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ 'మహాశివరాత్రి శుభాకాంక్షలు' తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో ఆడియోను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమాన్ సంగీతాన్ని సమకూర్చారు.తమిళనాడులోని పెరంబుదూర్ ధనలక్ష్మి శ్రీనివాసన్ కళాశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హన్సిక, జీవాలు సందడి చేశారు. జీవా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. చిత్రంలోని 'బబ్లీబబ్లీ' అనే పాటకు నృత్యం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 వేల మంది హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







