Wusool ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకున్న 20,000 మంది మహిళా ఉద్యోగులు
- June 11, 2021
సౌదీ: ప్రవైట్ రంగంలోని 20 వేల మంది సౌదీ మహిళా ఉద్యోగులు 7 నెలల కాలంలో Wusool ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించగా ఈ ఏడాది మే వరకు 20,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే సౌదీ మహిళలకు ప్రయాణ భారం తగ్గించటంతో పాటు సురక్షిత ప్రయాణ వసతులను కల్పించేందుకు Wusool ప్రోగ్రాంను ప్రారంభించిన విషయం తెలిసిందే. మానవ వనరుల అభివృద్ధి నిధికి అనుబంధంగా ఈ ప్రోగ్రాంను చేపట్టారు.Wusool ద్వారా ఎక్కువ మంది మహిళలకు లబ్ధి చేకూరేలా రిజిస్ట్రేషన్ విధానాన్ని సులభతరం చేయటం వల్లే ఎక్కువ మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు HRD అధికారులు తెలిపారు. అలాగే ప్రయాణ మద్దతు గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సౌదీలో 13 ప్రాంతాల్లో Wusool ద్వారా ప్రైవేట్ రంగంలోని మహిళకు రవాణా సౌకర్యం అందిస్తున్నారు. కొత్తగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్న మహిళా ఉద్యోగులు http://http://wusool.sa. ద్వారా పేర్లను నమోదు చేసుకొని లబ్ధి పొందవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







