బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
- June 11, 2021
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది.ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్‌తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే… క్రాక్‌లో జయమ్మ పాత్రకు జీవంపోసిన శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి… బాలయ్య బాబు చిత్రంలోనూ ఓ కీ-రోల్ పోషించబోతోందని తెలుస్తోంది. మన కథానాయికలు కొందరికి కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు లభిస్తున్నట్టుగానే…వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో దర్శక నిర్మాతలు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు.దాంతో కొంతకాలంగా వర తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే తెనాలి రామకృష్ణ మూవీలో నటించిన వరలక్ష్మి ఈ యేడాది క్రాక్‌తో పాటు నాందిలోనూ అద్బుతమైన పాత్రను పోషించి, నటిగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్ని దోచుకుంది. ఇక మాస్ హీరో బాలకృష్ణ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వర ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







