సౌదీ అరేబియా: కోవిడ్ 19 వ్యాక్సిన్ ద్వారా దీర్ఘకాలిక సమస్యలుండవు

- June 11, 2021 , by Maagulf
సౌదీ అరేబియా: కోవిడ్ 19 వ్యాక్సిన్ ద్వారా దీర్ఘకాలిక సమస్యలుండవు

జెడ్డా: సౌదీ వైద్య అధికారి ఒకరు, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలేమీ వుండవని ఆయన స్పస్టం చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అబ్దుల్లా అసిరి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్లకు ఘనమైన చరిత్ర వుందనీ, ఏ వ్యాక్సిన్ వల్ల కూడా దీర్ఘకాలిక సమస్యలున్నట్లు తేలలేదని ఆయన వివరించారు. ఇమ్యూన్ మెమరీని ఉత్సాహపరిచాక, వ్యాక్సిన్ సబ్‌స్టాన్స్ శరీరంలోంచి మాయమైపోతాయని వివరించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్ద్ అల్ అలీ, 12వ మక్కా అవార్డు ఆఫ్ ఎక్సలెన్సీని హ్యమానిటేరియన్ గాంగ్ కేటగిరీలో గెలుచుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com