'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించిన జెట్ ఎయిర్వేస్
- March 07, 2016
ఒమన్ నుంచి ఢిల్లీ మీదుగా భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్ళే ప్రయాణీకుల కోసం జెట్ ఎయిర్ వేస్ 'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించింది. ఈ ఆఫర్ ఏంటంటే, ప్రయాణీకులు మార్చ్ 6 నుంచి 12 మధ్యలో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి టిక్కెట్ ధరలో 15 శాతం రాయితీ ఇవ్వనున్నారు. 31 మే వరకు ప్రయాణించేవారి కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టెరి మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ మొత్తం 73 డెస్టినేషన్స్‌కి విమానాలు నడుపుతోంది. ఇందులో 51 భారతదేశంలోనివి కాగా, 22 ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 116 ఎయిర్ క్రాఫ్ట్‌లను జెట్ ఎయిర్ వేస్ వినియోగిస్తోంది. వీటిల్లో బోయింగ్ 777-300 ఇర్, ఎయిర్ బస్ ఎ330-200/300, నెక్స్ట్ జనరేషన్ బోయింగ్ 737 మరియు ఎటిఆర్ 72-500/600 వంటివి ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ వినియోగించుకోవడానికి జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







