దుబాయ్‌లో 4 రోజుల్లో 4 పార్కులు
- March 07, 2016
దుబాయ్ మునిసిపాలిటీ మరో నాలుగు కొత్త పార్కుల్ని దుబాయ్ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఆదివారం 36వ ప్లాంటేషన్ వీక్ సందర్భంగా ఈ పార్కులు ప్రారంభమవుతాయి. అల్ ట్వార్2, ఔద్ అల్ ముతీనా1, మంకూల్ మరియు అల్ వక్రా 2 వరుసగా ఒక్కో వారం ప్రారంభం కానున్నాయి. 20.5 మిలియన్ దిర్హామ్‌లు వెచ్చించి ఈ పార్కుల్ని రూపొందించారు. ప్లే గ్రౌండ్స్‌లో బేసిక్ సౌకర్యాలను కల్పించారు. అల్ త్వార్ 2 పార్క్‌లో పిల్లలు, మహిళల కోసం ప్లాజాను ఏర్పాటు చేశారు. వర్కా2 పార్క్‌లో ఫుట్‌బాల్ కోర్ట్ ఉంది. ఔద్ అల్ ముతీనా1 పార్క్‌లో జాగింగ్ ట్రాక్ మరియు మూడు స్పోర్ట్స్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఔద్ అల్ ముతీనా1లో 7 మిలియన్ దిర్హామ్‌లతో నిర్మించిన పార్క్ సమీపంలో ఉన్న ఇతర పార్కులన్నింటిలోకీ పెద్దది. దుబాయ్‌లో కమ్యూనిటీ పార్కులు, నైబర్‌హుడ్ పార్కులు, పాండ్ పార్కులతో కలిపి మొత్తం 115 పార్కులున్నాయి.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







