ఈ నెల 15 నుంచి ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలు

- June 12, 2021 , by Maagulf
ఈ నెల 15 నుంచి ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలు

సౌదీ: వేసవి కాలం రావటంతో పగటి వేళ బహిరంగ ప్రాంతాల్లో పనులను నిషేధిస్తూ సౌదీ మానవ వనరులు, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలులో ఉండనుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే మధ్యాహ్నం సమయం నుంచి మూడు గంటల వరకు కార్మికులతో ఎండతగిలే ప్రాంతాల్లో పనులను పురమాయించకూడదు. ప్రైవేట్ రంగంలోని కార్మికుల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, కార్మికులకు  సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com