APSSDC నుంచి ఉద్యోగ ప్రకటన...
- June 13, 2021
ఏపీ: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది.పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది.Fincare Small Finance Bankలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.మొత్తం 100 ఖాళీల్లో కడప జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 25, కర్నూల్ జిల్లాలో 40 ఖాళీలు ఉన్నాయి.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.
విద్యార్హతల వివరాలు.. Loan Divestment/Collection Agents విభాగాల్లో ఈ ఈ పోస్టులు కలవు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా వసతి సదుపాయం కల్పించనున్నారు. నెలకు రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు.దీంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కూడా ఉంటుంది. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.అయితే ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఇతర సందేహాలుంటే 9912867909, 9553202509, 9581670585 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







