ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త రికార్డు నెలకొల్పిన బర్బోరా క్రేజికోవా

- June 13, 2021 , by Maagulf
ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త రికార్డు నెలకొల్పిన బర్బోరా క్రేజికోవా

ప్యారిస్​: ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయ్యింది. చెక్​ రిపబ్లిక్​ టెన్నిస్​ ప్లేయర్​ బర్బోరా క్రేజికోవా రికార్డ్ సృష్టించింది. మహిళల సింగిల్స్​ టైటిల్​తో పాటు డబుల్స్​ ట్రోఫీని దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత ఇలాంటి చరిత్రను బర్బోరా తిరగరాసింది. ఫ్రెంచ్ ఓపెన్​ మహిళల డబుల్స్​ టైటిల్​ను చెక్​ రిపబ్లిక్​ జంట బర్బోరా క్రేజికోవా-కాథరినా సినియాకోవా  ఎగురేసుకుపోయింది. ఫైనల్లో ఇగ స్వియాటెక్​-బెథనీ మట్టెక్​ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది.

2000 సంవత్సరంలో ప్యారిస్​కు చెందిన టెన్నిస్​ క్రీడాకారిణి ఈ ఘనత సాధించింది. దీంతో తాజాగా ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది క్రేజీకోవా.
కాథరినా సినియాకోవాతో జత కట్టిన క్రేజీకోవా.. ఫైనల్లో ఇగ స్వియాటెక్​-బెథనీ మట్టెక్​ జంటపై 6-4, 6-2తో వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com