ఇండియా ను 'రెడ్ లిస్ట్' లో పెట్టుంటే ఇలా అయ్యేది కాదు - మంత్రి

- June 14, 2021 , by Maagulf
ఇండియా ను \'రెడ్ లిస్ట్\' లో పెట్టుంటే ఇలా అయ్యేది కాదు - మంత్రి

లండన్: భారత్ ను కుదిపేసిన 'డెల్టా వేరియంట్' కు ప్రపంచం భయపడుతోంది. కారణం, అత్యంత ప్రబలంగా, వేగంగా ఈ వేరియంట్ సోకటమే. ఇప్పుడు ఈ వేరియంట్ నెమ్మదిగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుండమే ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పటికే ఎన్నో దేశాలు భారత్ ను 'రెడ్ లిస్ట్' లో పెట్టి, భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించింది.

అయితే, ఇంగ్లాండ్ ఈ పని కాస్త నెమ్మదిగా చేసిందని అక్కడి నేతలు వాపోతున్నారు. గతంలో 'కెంట్ వేరియంట్' తో 64 శాతం నమోదైన కేసులతో భారీగా నష్టపోయిన ఇంగ్లాండ్, లాక్ డౌన్ విధించి కాస్త కుదుటపడింది. మెల్లిగా లాక్ డౌన్ ను సడలించిగా, భారత్ లో కనుగొన్న 'డెల్టా వేరియంట్' తో ఇప్పుడు మరలా 90 శాతం కేసులు నమోదవుతుండటంతో తలపట్టుకుంది ఇంగ్లాండ్ ప్రభుత్వం. భారత్ నుండి ప్రయాణీకులను నిషేధించడం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి తక్కిన దేశాలతో కలిసి తగిన సమయంలో చేసి ఉంటే ఈ పరిస్థితిని అదుపులో ఉంచేవాళ్ళం అంటూ ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని ఎండకడుతున్నాయి అక్కడి ప్రతిపక్షాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com