తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల పై ఆంక్షలు ఎత్తివేత
- June 14, 2021
న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గతంలో తెలంగాణ, ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోడ్డు, రైలు, విమానం ఇలా ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6న కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లతోపాటు ఆయా విభాగాలకు ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరించుకుంది. వాటితోపాటు నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలనే నిబంధనను కూడా సడలించింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే ప్రయాణికులు సాధారణ ప్రయాణాలు చేయడానికి సులభతరం అయింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







