ఆన్ లైన్ మోసాల పై ఖాతాదారులకు SBI హెచ్చరిక..

- June 14, 2021 , by Maagulf
ఆన్ లైన్ మోసాల పై ఖాతాదారులకు SBI హెచ్చరిక..

ముంబై: ఆన్ లైన్ మోసాలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన  ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. ఖాతాదారులు మోగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చరించింది. నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, డేటాప్‌బర్త్‌ వివరాలు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌ గానీ, పాస్‌వర్డ్‌, ఏటీఎం నెంబర్‌, బ్యాంకు అకౌంట్‌, ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌, సీవీవీ, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. అలాగే ఎవరైనా ఎస్‌బీఐ నుంచి ఫోన్‌లు చేస్తూ మీ బ్యాంకు వివరాలు, డెబిట్‌ కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవదని తెలిపింది.

ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా ఖాతాదార్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎస్‌బీఐ. అయితే చాలా మంది బ్యాంక్‌ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్‌లో ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకుంటున్నారు.ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు.ఇప్పటికే ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com