సీసీసీ ఆధ్వర్యంలో టివి ఆర్టిస్టులకు కరోనా వాక్సిన్
- June 14, 2021హైదరాబాద్: కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.తాజాగా టివి ఆర్టిస్టులకు కూడా వాక్సిన్ అందించే కార్యక్రమం సోమవారం నుండి జరుగుతుంది. ఈ వాక్సిన్ డ్రైవ్ లో టివి ఆర్టిస్టులకు కూడా అందించేందుకు సీసీసీ ముందుకు వచ్చిన సందర్బంగా ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ... సీసీసీ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు, ఆర్టిస్టులకు వాక్సిన్ వేసే కార్యక్రమం విజయవంతగా సాగుతుంది. ఇందులో భాగంగా టివి ఆర్టిస్టులకు కూడా ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం వర్తింప చేయాలనీ నేను అన్నయ్య చిరంజీవి ని అడిగినప్పుడు అయన వెంటనే ఓకే అన్నారు. ఈ రోజు నుండి టీవీ ఆర్టిస్ట్ అందరికి వాక్సిన్ ఇప్పిస్తున్నాం. ఈ సందర్బంగా ఈ అవకాశం కల్పించిన అన్నయ్యకు అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు, సీసీసీ, అపోలో వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా అందరు వాక్సిన్ డ్రైవ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను అన్నారు.
టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రముఖ నటుడు వినోద్ బాల మాట్లాడుతూ ... మన మెంబర్స్ కి,మన అసోసియేషన్ కు వ్యాక్సినేషన్ అవసరం ఉంది.అందుకే నాగబాబు అన్నయ కు చెప్పడంతో అయన వెంటనే రియాక్ట్ అయి అన్నయ చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమంలో టివి ఆర్టిస్టులు కూడా పాల్గొనేలా చేసినందుకు ముందుగా నాగబాబు అన్నయ్యకు థాంక్స్.అలాగే టివి ఆర్టిస్టులకు కూడా వ్యాక్సినేషన్ కల్పించిన చిరంజీవి అన్నయ్యకు థాంక్స్ చెబుతున్నా.టివి ఆర్టిస్టులందరు కూడా వ్యాక్సిన్ త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







